Sep 12, 2026, 16:09 IST/
దసరా కానుకగా మహిళలకు 'ఆడబిడ్డ నిధి' కింద రూ.18000?
Sep 12, 2026, 16:09 IST
AP: కూటమి ప్రభుత్వం ‘ఆడబిడ్డ నిధి’ పథకంపై కసరత్తు చేస్తోంది. ఈ పథకం కింద 18-59 ఏళ్ల మహిళలకు దసరా కానుకగా రూ.18,000 అందించనున్నట్లు సమాచారం. ఇది హామీ అమల్లో భాగమే అయినప్పటికీ, ఒక్కసారిగా రూ.18,000 ఇస్తారా లేక నెలనెలా రూ.1,500 ఇస్తారా అనే దానిపై స్పష్టత లేదు. ఈ పథకం అమలు, దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తి అధికారిక మార్గదర్శకాలు త్వరలో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ పథకానికి గతంలో బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగిన విషయం తెలిసిందే.