Oct 05, 2026, 17:10 IST/స్టేషన్ గన్ పూర్
స్టేషన్ గన్ పూర్
రావణాసుర వధకు ఘనంగా భూమి పూజ: ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభం
Oct 05, 2026, 17:10 IST
ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండలోని అయోధ్యపురం ట్రాక్ వద్ద దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న రావణాసుర వధ కార్యక్రమానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 64వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దువ్వ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కాంగ్రెస్ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.