Sep 07, 2026, 16:09 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
వరంగల్లో పోలీసులకు క్రౌడ్ మేనేజ్మెంట్ శిక్షణ ప్రారంభం
Sep 07, 2026, 16:09 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పండగలు, జాతరలు, ఊరేగింపుల సమయంలో భారీ జనసమూహాన్ని నియంత్రించడం, ప్రజలతో ఎలా ప్రవర్తించాలనే అంశంపై భద్రాద్రి జోనల్ పరిధిలోని 43 మంది పోలీసు శిక్షకులకు మడికొండ కేంద్రంలో సోమవారం నాలుగు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. వరంగల్, ఖమ్మం కమిషనరేట్లు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సిబ్బంది హాజరైన ఈ శిక్షణను వరంగల్ సిపి ఎన్. శ్వేత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ క్రౌడ్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తుంది.