
కాపు జేఏసీ కడప జిల్లా అధికార ప్రతినిధిగా గోవిందు గణేష్ రాయల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ కడప జిల్లా అధికార ప్రతినిధిగా గోవిందు గణేష్ను నియమిస్తూ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గోవిందు గణేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కడప జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన కాపు జేఏసీ చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తూ కాపు సామాజిక వర్గ సంక్షేమం, ఐక్యత, హక్కుల సాధన కోసం కృషి చేస్తానన్నారు.




















