కత్రేనికోన - Katrenikona

ఉమ్మడి వరంగల్ జిల్లా
Sep 07, 2026, 17:09 IST/ములుగు
ములుగు

గిరిజన బాలికల హాస్టల్‌ ను తనిఖీ చేసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు

Sep 07, 2026, 17:09 IST
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం గిరిజన బాలికల హాస్టల్‌లో నెలకొన్న దుస్థితిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తాగునీరు, భోజనం, వాష్‌రూమ్‌ల పరిస్థితులను పరిశీలించగా, స్నానాలకు వాడే నీటినే తాగాల్సి వస్తోందని, అల్పాహారంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డెన్ అనుచితంగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హాస్టల్ నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ విఫలమైందని లక్ష్మణ్ బాబు ఆరోపిస్తూ, వార్డెన్‌పై తక్షణ చర్యలు, సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.