కోడూరు - Koduru

ఉమ్మడి వరంగల్ జిల్లా
Oct 11, 2026, 14:10 IST/

కామ్రేడ్ కల్యాణ్ షూటింగ్‌లో ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న నటుడు

Oct 11, 2026, 14:10 IST
‘కామ్రేడ్ కల్యాణ్’ సినిమా షూటింగ్‌లో సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2025 ఫిబ్రవరిలో మంగళూరు అడవుల్లో ఎత్తైన వంతెనపై యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా అదుపుతప్పి కింద పడబోయారు. వెంటనే స్పందించిన హీరో శ్రీ విష్ణు, కోన వెంకట్, దర్శకుడు జానకీరామ్ మారెళ్ల, సిబ్బంది ఆయనను పట్టుకుని పైకి లాగారు. ఈ మేకింగ్ వీడియోను శ్రీకాంత్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఇది తనకు పునర్జన్మ లాంటిదని పేర్కొన్నారు. అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతోంది.