
చాపాడు పాఠశాలలో స్కూల్ కమిటీ చైర్మన్గా అలీ మస్తాన్
వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండల కేంద్రమైన చాపాడులోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అలీ మస్తాన్ చైర్మన్గా, సి.ఎస్. సల్మా వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
























