
ప్రొద్దుటూరులో ఎస్ఎంసీ ఎన్నికలు.. చైర్మన్గా హేమలత
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని సోములవారిపల్లె ఈశ్వర్ రెడ్డి నగర్ జడ్పీహెచ్ఎస్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో హేమలత చైర్మన్గా, లీలావతి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎన్నికైన వారికి స్థానిక టీడీపీ నాయకులు పల్లెటి రామకృష్ణారెడ్డి, హనుమంత రెడ్డి, నాగేంద్ర, హజీవల్లి, భాస్కర్ శుభాకాంక్షలు తెలిపారు.

































