
పులివెందులలో పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చెయ్యాలి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 30న వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పార్నపల్లి గ్రామంలో జల జీవన్ పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించే ఈ పథకం ఎంతో ప్రయోజనకరమని జనసేన నాయకుడు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన శుక్రవారం పిలుపునిచ్చారు.

























