Sep 09, 2026, 12:09 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
వరంగల్లో వృద్ధుడికి టావీ ద్వారా గుండె చికిత్స
Sep 09, 2026, 12:09 IST
వరంగల్లో 78 ఏళ్ల వృద్ధుడికి బుధవారం టావీ (TAVI) ద్వారా విజయవంతంగా గుండె చికిత్స అందించారు. బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్తో పాటు అసెండింగ్ అయోర్టా విస్తరించి ఉండటంతో కేసు క్లిష్టంగా మారింది. రోగి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న వైద్య బృందం, ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే తొడ రక్తనాళం ద్వారా కృత్రిమ వాల్వ్ను అమర్చింది. డాక్టర్ సంతోష్ మోదాని నేతృత్వంలో ఈ ప్రక్రియ పూర్తయింది. చికిత్స అనంతరం రోగి ఆరోగ్యంగా స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.