Oct 01, 2026, 06:10 IST/
రీ రిలీజ్కు సిద్ధమైన బ్లాక్బస్టర్ ప్రేమకథ 'గీతాంజలి'
Oct 01, 2026, 06:10 IST
తెలుగు సినీ చరిత్రలో ప్రేమకథా చిత్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న 'గీతాంజలి' సినిమా నవంబర్ 13న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆయన కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. మరణానికి దగ్గరవుతున్న ఇద్దరు ప్రేమికుల కథతో భావోద్వేగభరితంగా రూపొందిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందాయి. అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ఈ రీ-రిలీజ్ను ప్రకటించింది.