రాయచోటి - Rayachoti

భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో భార్యపై అనుమానంతో భర్త ఆమెను రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. నాలుగేళ్ల కుమారుడు చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. అన్నమయ్య జిల్లాకు చెందిన నరేందర్, తేజశ్రీ దంపతులు ఆరు నెలల క్రితం చిక్కడపల్లికి వచ్చి నివసిస్తున్నారు. భార్యపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం గొడవ తీవ్రం కావడంతో నరేందర్ తేజశ్రీ తలపై రోకలిబండతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నరేందర్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.