Sep 25, 2026, 03:09 IST/
ఇన్ సర్వీస్ టీజీ టెట్ ఫలితాలు రేపు విడుదల
Sep 25, 2026, 03:09 IST
TG: రాష్ట్రంలో సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన టీజీ టెట్ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 26న విడుదల కానున్నాయి. ఈ నెల 26న ఉదయం 11 గంటలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో ఉన్నతాధికారులు ఫలితాలు విడుదల చేస్తారు. ఈ పరీక్షకు 24,986 మంది దరఖాస్తు చేసుకోగా, 22,477 మంది హాజరయ్యారు. ఫలితాల అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ స్కోర్ కార్డులను చూసుకోవచ్చు.