Sep 26, 2026, 17:09 IST/ములుగు
ములుగు
మోదీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం
Sep 26, 2026, 17:09 IST
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం మరియు ఆయన ప్రజాప్రతినిధిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగులోని బిజెపి జిల్లా కార్యాలయంలో చల్లా రాంకి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరావుతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని శ్రీనివాసరావు పేర్కొన్నారు.