Sep 26, 2026, 17:09 IST/ములుగు
ములుగు
పోషణ మాసం: గర్భిణులు, బాలింతలకు అవగాహన
Sep 26, 2026, 17:09 IST
మంగపేట మండలం మల్లూరులో శనివారం అంగన్వాడీ సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు. సీడీపీఓ కే. సితారాములు హాజరై, తల్లులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు. శరీరానికి శక్తి, రక్షణ, పెరుగుదలకు మొక్కజొన్న, గోధుమలు, పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, చేపలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు.