Sep 22, 2026, 05:09 IST/
వామ్మో.. ఒక్క పులస చేప ధర రూ.27 వేలు
Sep 22, 2026, 05:09 IST
గోదావరిలో అరుదుగా దొరికే పులస చేపకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. తాజాగా యానాంలో లభించిన ఓ పులస చేప రూ.26 వేలకు వేలంలో దక్కించుకున్న మత్స్యకారుడు, దానిని రూ.27 వేలకు విక్రయించారు. ఈ ఏడాది యానాంలో పులస చేపకు ఇదే అత్యధిక ధర. గత పది రోజుల్లో కేవలం ఏడు పులస చేపలు మాత్రమే దొరకగా, అవి రూ.14 వేల నుంచి రూ.22 వేల వరకు ధర పలికాయి. పులస చేప సంతానోత్పత్తి కోసం వర్షాకాలంలో సముద్రం నుండి గోదావరి నదిలోకి వస్తుంది, అందుకే దీనికి ప్రత్యేక రుచి ఉంటుందని చెబుతారు.