
టెహ్రాన్ ఆకాశంలో వింత వెలుగులు.. యూఎఫ్ఓనా? డ్రోనా?
ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంలో రంగురంగుల వెలుగులతో అనుమానాస్పదంగా ఎగురుతున్న ఒక విచిత్ర ఎయిర్ షిప్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. సెప్టెంబర్ 20న రికార్డు చేసినట్టు భావిస్తున్న ఈ వీడియోలపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సైనిక డ్రోన్ లేదా యూఎఫ్ఓ కావొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ వీడియోలు బయటకు రావడం గమనార్హం.




