
కాకినాడలో మెడికల్ కార్మికులకు ఈఎస్ఐ కార్డుల పంపిణీ
కాకినాడ మెడికల్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడ అన్నదాన సమాజం హాల్లో ఈఎస్ఐ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఈఎస్ఐ కన్సల్టెంట్ బాబ్జీ కార్మికులకు కార్డులను అందజేసి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యూనియన్ ప్రెసిడెంట్ ఎల్లారావు, సెక్రటరీ సత్యనారాయణ తదితర సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



































