
కాకినాడ రూరల్ జడ్పీటీసీ అభ్యర్థిగా సాధనాల నర్మద నామినేషన్
న కాకినాడ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ (BSP) ఆధ్వర్యంలో జడ్పిటిసి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ జరిగింది. కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బు బాయ్ పర్యవేక్షణలో, సాధనాల ఇందు బాల నర్మద కాకినాడ రూరల్ జడ్పిటిసి అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను శుక్రవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కాకినాడ రూరల్ మండల ఓటర్లను ఏనుగు గుర్తుపై ఓటు వేసి, తమ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

































