
కాకినాడ తలుపులమ్మ ఆలయానికి రూ. 2.82 లక్షల ఆదాయం
కాకినాడ జిల్లా, తుని మండలంలోని శ్రీ తలుపులమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 6 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఒక్క రోజులో ప్రసాదాలు, పూజా టిక్కెట్లు, కేశకండన, కాటేజీలు మరియు ఇతర సేవల ద్వారా దేవస్థానానికి మొత్తం రూ. 2,82,643 ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వహణాధికారి శ్రీ విశ్వనాధ రాజు తెలియజేసారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.







































