TG: రెండేళ్లపాటు సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా
టాటా, విశాల్ గున్నీలను ప్రభుత్వం పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం వీరిని కాదంబరి జత్వానీ కేసు పేరుతో సస్పెండ్ చేసిందని, ఇటీవల జత్వానీపై సీఐడీ చీటర్ అంటూ చార్జిషీట్ దాఖలు చేయడంతో వీరి సస్పెన్షన్ ఎత్తివేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఇద్దరు అధికారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది.