కరువు-చంద్రబాబు కవల పిల్లలు: పుత్తా శివశంకర్‌

4085చూసినవారు
AP: వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని ఆరోపించారు. పంచదార రూ.40 నుంచి రూ.75, బియ్యం రూ.48 నుంచి రూ.65, ఉల్లిపాయలు రూ.18 నుంచి రూ.70, నూనెలు రూ.140 నుంచి రూ.215కు పెరిగాయని తెలిపారు. కూరగాయలు, లిక్కర్, విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగాయని, ధరల పెరుగుదలపై ప్రభుత్వం సమీక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్