ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖలో ఉద్యోగ నియామక నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. స్థానిక క్యాడర్ విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (1993)లో సవరణలు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరణలు ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం, పరిశ్రమల శాఖ పరిధిలోని పోస్టులను వివిధ స్థానిక క్యాడర్లుగా ఏర్పాటు చేసి, ప్రత్యక్ష
నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీ వంటి సేవా అంశాలను ఆయా యూనిట్ల పరిధిలో నిర్వహించాలని నిర్ణయించారు.