జనసేనలో చేరిన కీలక నేతలు

1చూసినవారు
జనసేనలో చేరిన కీలక నేతలు
AP: విజయవాడ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ, సీపీఎం నేతలు, వ్యాపారవేత్తలు బుధవారం జనసేన పార్టీలో చేరారు.జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు వారికి కండువా కప్పారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో 300 మంది జనసేనలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమంలో 40 మంది జనసైనికులకు ఆటోలు, 25 మంది వీరమహిళలకు కుట్టు మిషన్లు, 25 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను నాగబాబు అందించారు.

సంబంధిత పోస్ట్