టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రూ.129.85 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. భోలే బాబా, శ్రీ వైష్ణవి డెయిరీ, సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్, విపిన్ జైన్, పొమిల్ జైన్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.