అమలాపురం - Amalapuram

హెల్త్ డిపార్ట్‌మెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా

డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులరైజేషన్ జరిగే వరకు ఉద్యోగులకు 100% గ్రాస్ సాలరీ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సంవత్సరాలుగా ప్రభుత్వ ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న జీతాలు, బకాయిలను వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని కోరారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా