
కొంకుదురులో ఘనంగా చండీ హోమం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని కొంకుదురు గోపాల రామానాయుడు వీధిలో మంగళవారం శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండీ హోమం వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ భాస్కర శర్మ, రమణ శర్మల ఆధ్వర్యంలో అర్చక బృందం ఈ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి అన్నపూర్ణ అవతార విశిష్టతను భక్తులకు వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించి, హోమం అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు.
































