
భవానీ భక్తులకు అన్నసమారాధన
గన్నవరం మండలం దుర్గాపురంలో మంగళవారం భవానీ భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దుర్గాపురం వాస్తవ్యులు సి.హెచ్. శ్రీను, షేక్ మస్తాన్, వి. సోములు, ఆర్. రవి కుమార్, ఎస్. కిరణ్, సి.హెచ్. హనుమంతరావు, కె. నారాయణ రావు, ఎం. గోపి, వారి మిత్ర బృందం కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకలో ప్రముఖ న్యాయవాది అమర్తల సోమేశ్వరరావు, షేక్ హాజీ, షేక్ కరీముల్లా, న్యాయవాదులు షేక్ రహంతుల్లా, విమల్ కుమార్, శివ కృష్ణ, వేణు మాధవ్, కొమ్మని కవిత తదితరులు పాల్గొన్నారు.





































