
పవన్ కళ్యాణ్ కీలక నియామకాలు: స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా, జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం పార్లమెంట్, అసెంబ్లీ సమన్వయ కమిటీలను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ సమన్వయకర్తగా దొడ్డిగర్ల సువర్ణ రాజు, ధుమంతునిగూడెం గ్రామ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినాల నరసింహమూర్తి నియమితులయ్యారు. ఈ నియామకాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి దోహదపడతాయని భావిస్తున్నారు. .





































