జగ్గంపేట శివారు టవర్ కాలనీ వద్ద రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు జగ్గంపేట ఎస్సై టి. రఘునాధరావుకు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకునే వారి వద్ద నుంచి రూ. 6,100 నగదు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.