
పెద్దాపురం ఆదిత్య పాఠశాలలో ఘనంగా ప్రపంచ బాలల దినోత్సవం
పెద్దాపురం ఆదిత్య పాఠశాలలో ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి హాజరయ్యారు. బాలల హక్కులు, భద్రత, విద్య మరియు చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




























