
చాగల్లు మండల పరిషత్ ఎంపిపి, జడ్పిసి రిజర్వేషన్ లు ప్రకటన
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం చాగల్లు మండల పరిషత్ బిసి మహిళకు రిజర్వ్ చేసినట్లు ప్రకటన వెలువడింది. అలాగే చాగల్లు మండలం జడ్పీటీసీ షెడ్యూల్ కాస్ట్ కి రిజర్వ్ అయినట్లు ప్రకటనలు వెలువడింది. దీంతో మండలంలోని ప్రధాని పార్టీ అయినటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి పార్టీలు ఇతర పార్టీలు తమతమ అభ్యర్థుల కొరకు అన్వేషణ ప్రారంభించింది. రిజర్వేషన్ ఖరారు కావడంతో మండలంలో ఒక్కసారిగా ఊహించిన విధంగా కాకుండా వేరే విధంగా రిజర్వేషన్లు స్థానాలు ప్రకటన రావడంతో ఒక్కసారిగా పార్టీ నాయకులు ఉలిక్కిపడి ఎన్నికల సమరానికి శ్రీకారం చుడుతున్నారు.


































