తూ.గో. జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో దీపావళి అమావాస్య రోజున క్షుద్ర పూజల ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామ శివారులోని వైస్ కళాశాల సమీపాన గల ఆలయం వద్ద, ఒక వ్యక్తి దుస్తులు లేకుండా గొయ్యి తీసి పూజలు చేస్తున్న విషయాన్ని స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన వారు సదరు వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నిలదీశారు. సంఘటనా స్థలంలో పసుపు, కుంకుమ, అన్నం ముద్దలను స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.