
తాటిపాకలో ఒక్కసారిగా మారిన వాతావరణం
తాటిపాకలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై పెద్ద పెద్ద జల్లులతో భారీ వర్షం కురుస్తోంది. ఈ అకస్మిక వర్షం కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వెళ్లే వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది. సాధారణ జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది.






















