
విషాదం.. పంటకాలువలో పడి చిన్నారి మృతి
పెద్దాపురం మండలం పులిమేరులో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. రంగనాథ్ షణ్ముఖ (4) అనే చిన్నారి, ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పంటకాలువలో పడిపోయాడు. వెంటనే అతన్ని పెద్దాపురం ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చిన్నారి అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు.





















