గొల్లప్రోలులో భారీ దొంగతనం

62చూసినవారు
గొల్లప్రోలులో భారీ దొంగతనం
పిఠాపురం పరిధిలోని గొల్లప్రోలు పట్టణంలో పాశం సురేఖ అనే మహిళ ఇంట్లో గుర్తుతెలియని దొంగలు మంగళవారం చోరీకి పాల్పడ్డారు. కుటుంబ కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన సమయంలో, ఇంటి వెనుక తలుపు ద్వారా ప్రవేశించిన దుండగులు బీరువా తాళాలు పగలగొట్టి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులు, కొంత నగదు, బ్యాంకు లాకర్ తాళాలను అపహరించారు. బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తోంది.

సంబంధిత పోస్ట్