
స్థానిక సంస్థల సీట్ల పంపకంపై బీజేపీ అసంతృప్తి
రాజమండ్రిలో బీజేపీ సీనియర్ నాయకుడు కోడూరి లక్ష్మీనారాయణ గురువారం మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో కూటమి పార్టీల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు చర్చలకు పిలిచి, చివరకు నిరాశపరచడం సరికాదని ఆయన విమర్శించారు. స్థానికంగా పార్టీ బలాబలాలు, నాయకులు, కార్యకర్తల ఆర్థిక స్థోమతను ప్రశ్నించడం తగదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

































