
గాడ్స్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
రాజోలు నియోజకవర్గంలో గాడ్స్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కందికట్ల రేచర్ల జ్యోతి పుట్టినరోజు సందర్భంగా అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన నిరాశ్రయులైన బుడితి ఖల్నాయక్, ఎర్రమ్మ దంపతులకు నిత్యావసర సరుకులు గురువారం పంపిణీ చేశారు. సొంత ఇల్లు లేకుండా జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి తెలుసుకున్న ఫౌండేషన్ సభ్యులు ఈ సహాయం అందించినట్లు పాస్టర్ గుర్రం రాజు, గెడ్డం రాజు, దొండపాటి సునీల్, కె. గణేష్ తెలిపారు.






































