అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో 3వ రోజు శనివారం పాదయాత్ర జరిగింది. అధిక ధరలు తగ్గించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టాలని, రైతులకు లాభసాటి ధర కల్పించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణ సదుపాయం కల్పించాలని, ఆక్వా మేత ధరలు తగ్గించాలని, ఇల్లు స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ప్రజలకు కరపత్రాలు పంచుతూ, నినాదాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించారు.