
తేటగుంటలో జీడి రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ
కాకినాడ జిల్లా, తుని మండలం తేటగుంట గ్రామంలో నాసా సంస్థ ఆధ్వర్యంలో జీడి రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమంగురువారం, జరిగింది. ఈ సందర్భంగా ICRP సిబ్బంది గొర్ల రామలక్ష్మి మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే సేంద్రియ పద్ధతులను వివరించారు. ఫీల్డ్ కోఆర్డినేటర్ పద్మ పురుగుమందులకు బదులుగా ఘన, ద్రవ జీవమృతాల తయారీని ప్రత్యక్షంగా చూపారు. ఈ కార్యక్రమంలో రైతులు నూకరాజు, సత్తిబాబు, చిన్నలోవరాజు తదితరులు పాల్గొన్నారు.



































