వరదలో చిక్కుకున్న కొవ్వూరు RDO (వీడియో)

27చూసినవారు
AP: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. కొవ్వూరు RDO ఆనందరావు వరదలో చిక్కుకుపోయారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లిన ఆయనకు వరద ప్రవాహం చుట్టుముట్టింది. వరద నీటి ఉధృతికి కార్లు, బైకులు, పశువులు కొట్టుకుపోయినట్లు సమాచారం.  RDO ఆనందరావు క్షేమంగానే ఉన్నారని MPDO తెలిపారు. వరద పరిస్థితులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్