
బంగారం దుకాణంలో సైనైడ్ తిని చిన్నారి మృతి
హైదరాబాద్లోని చింతల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల ఠాణా పరిధిలో ఈ నెల 7న జరిగిన ఓ జ్యువెలరీ షాప్లో టేబుల్పై ఉంచిన సైనైడ్ అనే రసాయనాన్ని పొరపాటున తిని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులతో కలిసి బంగారు షాప్కు వెళ్లిన చిన్నారి, ఆభరణాల స్వచ్ఛత పరీక్షించేందుకు ఉంచిన సైనైడ్ను తినడంతో అస్వస్థతకు గురైంది. సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తమకు న్యాయం చేయాలని చిన్నారి బంధువులు బంగారం దుకాణం ఎదుట ఆందోళన చేపట్టారు.




