
కేసరపల్లి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీటీసీకి నామినేషన్ దాఖలు..
కేసరపల్లి 3వ సెగ్మెంట్ నుండి ఇండిపెండెంట్ ఎంపీటీసీ అభ్యర్థిగా సొంటి కిషోర్ నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుండి భారీ ర్యాలీతో బయలుదేరి మండల ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.




































