
వివాహితను వేధిస్తున్న యువకుడిపై దాడి
విజయవాడలోని పీవీపీ మాల్ రోడ్డులో వివాహితను వేధిస్తున్న నిఖిల్ అనే యువకుడిపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు దాడి చేశారు. అవనిగడ్డకు చెందిన నిఖిల్ అదే ప్రాంతానికి చెందిన యువతి పెళ్లి కాకముందు ప్రేమించుకున్నారు. ఆతరవాత ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. గతంలో సన్నిహితంగా ఉన్న ఆమె ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి, ఆమె భర్తకు కూడా పంపాడు. నెల రోజులుగా ఆమెను కలవాలని వేధిస్తుండగా వివాహిత కుటుంబ సభ్యులు పథకం ప్రకారం రప్పించి దాడి చేశారు. పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు.





























