
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
విజయవాడ-మచిలీపట్నం హైవేలోని గుడివాడ రోడ్డు ఫ్లైఓవర్ పై ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో జగ్గయ్యపేటకు చెందిన ఒరుసు చిన్న తిరుపతమ్మ (60) అక్కడికక్కడే అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


























