
చండ్రుగూడెంలో వైసీపీ ఇంటింటి ప్రచారం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చండ్రుగూడెంలో వైఎస్సార్సీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒకటో వార్డు అభ్యర్థి రాజులపాటి రమాదేవిని గెలిపించాలని ఓటర్లను కోరారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ, టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుపై ప్రశ్నలు సంధించారు. ఈ ప్రచారంలో గ్రామ సర్పంచ్ బోలాగని శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు దేవరకొండ ఆంజనేయులు, గ్రామ పార్టీ అధ్యక్షుడు శీలం బుజ్జి, మాజీ ఎంపీటీసీ 1 చిట్టి బొమ్మల వెంకటేష్, ఎంపీటీసీ 2 శీలం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.





































