
చలి పులి కురుస్తుంది
NTR జిల్లా కంచికచర్ల మండలం S. అమరవరం గ్రామంలో చలి పులి లా విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా ఉదయం నుంచి దట్టమైన మంచు కురుస్తూ ప్రజలను వణికిస్తుంది. తెల్లవారుజామున 5 గంటలకే మంచు దుప్పటి కప్పినట్లుగా గ్రామం మొత్తం మారిపోతుంది. 10 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించడం లేదు. చలి తీవ్రతకు వృద్ధులు చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

























