పామర్రు - Pamarru

ఐనపూరు హైస్కూల్లో దాత చేతుల మీదుగా కళావేదిక ప్రారంభం

ఐనపూరు హైస్కూల్లో దాత చేతుల మీదుగా కళావేదిక ప్రారంభం

కృష్ణా జిల్లా, పామర్రు మండలం ఐనపూరు హైస్కూల్లో 4 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కళావేదికను దాత దేవరపల్లి సరళ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత సరళ మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేవరపల్లి అగ్గిరామయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ దూడల శివనాగభవాని, సభ్యులు కొండా బసివిరెడ్డి దాత సరళను ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

వీడియోలు


రాజన్న సిరిసిల్ల జిల్లా