పామర్రు మండలం శివారు మూలమలుపుల వద్ద సోమవారం కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన ఉన్న నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.