పామూరులో నగదు బాకీ విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం గణేశ్నగర్లోని వెంకటేశ్ ఇంటి వద్దకు గంధం యాకోబు వెళ్లాడు. ఈ క్రమంలో వెంకటేశ్ బంధువు శీను రోకలిబండతో యాకోబుపై దాడి చేశాడు. దీంతో యాకోబుకు తీవ్ర గాయాలయ్యాయి. నగదు బాకీ విషయంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.